ఆలయ నిధులపై బీజేపీ నేత రాంగోపాల్‌రెడ్డి ఆరోపణలు
భక్తులు, దాతల సొమ్మును ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేస్తున్నారు హుస్నాబాద్, అక్టోబరు 8 (చైతన్యగళం): దేవాలయాల అభివృద్ధికి భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి రూ.3.80 కోట్లు, పొట్లపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ దేవస్థానానికి రూ.85 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఎండోమెంట్ శాఖ పరిధిలోని...