మహబూబాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణుల సమరభేరి
‘భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే’గా భారీ నిరసన ర్యాలీ బీజేపీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో ప్రదర్శన మహబూబాబాద్, అక్టోబర్ 8(చైతన్యగళం):భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న...