మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ఘనంగా సేవా జ్యోతి యాత్ర
హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వరకు బైక్ ర్యాలీ.. వికసిత్ భారత్–2047 సాధనకు సంకల్పం హుస్నాబాద్, అక్టోబరు 7 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు సంకల్పంగా నిర్వహిస్తున్న పీఎం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సేవా జ్యోతి యాత్రను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి బైక్...