బతుకమ్మ నిమజ్జనానికి ఘాట్ ఏర్పాట్లు
చిన్న కంజర్ల కోపు చెరువు వద్ద మెట్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు పటాన్‌చెరు, అక్టోబరు 7 (చైతన్యగళం): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కంజర్ల గ్రామంలో సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కోపు చెరువు వద్ద నిర్మిస్తున్న ఘాట్ మెట్ల పనులను మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ భూపాల్‌గౌడ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు...