CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బతుకమ్మ నిమజ్జనానికి ఘాట్‌ ఏర్పాట్లు

  • చిన్న కంజర్ల కోపు చెరువు వద్ద మెట్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు

పటాన్‌చెరు, అక్టోబరు 7 (చైతన్యగళం): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కంజర్ల గ్రామంలో సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కోపు చెరువు వద్ద నిర్మిస్తున్న ఘాట్‌ మెట్ల పనులను మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్‌ మల్లేపల్లి శ్రీనివాస్‌, 18వ వార్డు కౌన్సిలర్‌ భూపాల్‌గౌడ్‌ మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మల్లేపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు వద్ద మెట్లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో దిల్‌ ఆర్‌.కృష్ణ, రామచంద్రారెడ్డి, నాగభూషణం, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.