ప్రభుత్వ ఆసుపత్రిలో ఐవీ బాటిల్ చేతితో పట్టుకోవాల్సిందేనా?
20 నిమిషాలకు పైగా రోగి బంధువు చేతిలోనే ఐవీ.. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై ప్రశ్నలు నందికొట్కూరు, అక్టోబరు 7 (చైతన్యగళం): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి కనీస చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉండకూడదా? ఐవీ ద్రావణం ఎక్కించేందుకు అవసరమైన పరికరాలు లేక రోగి బంధువే బాటిల్‌ను చేతితో పట్టుకుని 20 నిమిషాలకు పైగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కనిపించిన దృశ్యం ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి చికిత్స అందిస్తున్న సమయంలో ఐవీ ద్రావణం...