శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ అండ్ సెర్చ్.. అనుమానితులపై నిఘా: రూరల్ ఏసీపీ విజయకుమార్
కరీంనగర్, అక్టోబరు 7 (చైతన్యగళం): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం, మల్కాపూర్ గ్రామాల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయకుమార్ పర్యవేక్షణలో, కొత్తపల్లి ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తనిఖీలు చేపట్టాయి. గ్రామాల్లోని ప్రతి వీధిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితుల వివరాలను ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రజల...