CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:47 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం – మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ అక్టోబర్ 5 (చైతన్యగళం):

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తన చాంబర్‌లో మొదటి విడత కింద నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి అనుమతి పత్రాలను అందజేశారు.

మొదటి విడతలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 39 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు జారీ చేశారు. అనుమతి పత్రాలు పొందిన లబ్ధిదారులు మేయర్, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వాలు గృహ పథకాలను ప్రారంభించాయని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం జారీ చేసిన ప్రొసీడింగ్ పత్రాల ద్వారా లబ్ధిదారులు వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, మాసం గణేష్, సోమిడి వేణు, యూసూబ్, దేవసాని సరస్వతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.