కరీంనగర్, అక్టోబర్ 6 (చైతన్యగళం):
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్ రామచంద్రాపూర్ కాలనీలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ హైమాస్ట్ లైట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, మున్సిపల్ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.