చిరుధాన్యాలతో ఆరోగ్యమే మహాభాగ్యం

పోషణ మాసం సందర్భంగా పందిల్లలో పౌష్టికాహార ప్రదర్శన హుస్నాబాద్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామంలో అంగన్‌వాడీ ఆధ్వర్యంలో పోషణ మాసం మహోత్సవాలను మంగళవారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించారు. గ్రామ మహిళలు చిరుధాన్యాలు, తృణధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల పిండివంటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ జయప్రద మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల విటమిన్ల లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను...