CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:02 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

  • బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్పం–అంగన్‌ మిలన్‌’ కార్యక్రమం

మంచాల, అక్టోబరు 6 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా మంచాల మండలంలోని ఆరుట్ల, తాళ్లపల్లిగూడ, కాకగాజ్‌ఘాట్‌ గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్పం–అంగన్‌ మిలన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు నూకం రాజు ముదిరాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరై అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా నూకం రాజు మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, పేద కుటుంబాల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న సిబ్బందిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

కార్యక్రమంలో తాళ్లపల్లిగూడ సర్పంచ్‌ జోగు శంకరయ్య, కాకగాజ్‌ఘాట్‌ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.