కరీంనగర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

కరీంనగర్ అక్టోబర్ 5 (చైతన్యగళం): ప్రపంచంలోనే పువ్వులనే దేవుడిగా కొలిచే ఏకైక అద్భుతమైన పండుగ బతుకమ్మ అని, ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముఖరంపుర మల్టీపర్పస్ మైదానంలో కరీంనగర్ జిల్లా, నగర బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పండుగ...