ఈసీని బీజేపీ అనుబంధ సంస్థలా మార్చేశారు!

అర్హులైన పేదల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోహెడ, అక్టోబరు 6 (చైతన్యగళం): కేంద్ర ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. సోమవారం కోహెడ మండలం నకిరికొమ్ములలో ఆయన మాట్లాడుతూ బీజేపీ విధానాలను వ్యతిరేకించే పేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, బిహార్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల...