కార్మికుల హక్కుల పోరాటాల్లో ధ్రువతార వెంకటస్వామి

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు: మండిగ రేణుక రాజనర్సయ్య ఎలిగేడు, అక్టోబరు 5 (చైతన్యగళం): కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి (కాక) అని పెద్దపల్లి మాజీ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక రాజనర్సయ్య అన్నారు. సోమవారం ఎలిగేడులో వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల కోసం వెంకటస్వామి చేసిన...