CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా

  • వారం రోజులుగా నీళ్లు రావడం లేదంటూ కొండాపూర్‌ మహిళల నిరసన

చిగురుమామిడి, అక్టోబరు 6 (చైతన్యగళం): మండలంలోని కొండాపూర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు, గ్రామస్థులు సోమవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వారం రోజులుగా నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్యను సర్పంచ్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.