ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
సైదాపూర్, అక్టోబర్ 6(చైతన్యగళం): కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తాలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చౌరస్తా వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ వేడుకల సమయంలో మహిళలు, పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తారని, ఆ సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న తీగలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రామస్తులు...