ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్, వామపక్షాల నిరసన
మహబూబాబాద్‌లో భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట మహాధర్నా మహబూబాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ తదితర పార్టీల ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్‌లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. కన్నన్న కాలనీ పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి...