అనాథ పిల్లల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

మురళీనాయక్‌ జన్మదినం సందర్భంగా అన్నదానం మహబూబాబాద్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మదర్సాలో అనాథ పిల్లల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ఎడ్ల రమేష్‌, నాళ్ల నరసింహారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మురళీనాయక్‌ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో...