CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అనాథ పిల్లల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  • మురళీనాయక్‌ జన్మదినం సందర్భంగా అన్నదానం

మహబూబాబాద్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మదర్సాలో అనాథ పిల్లల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ఎడ్ల రమేష్‌, నాళ్ల నరసింహారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మురళీనాయక్‌ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఖలీల్‌, వార్డు కౌన్సిలర్‌ సల్వాజి దిలీప్‌, మహమ్మద్‌ జమీల్‌, ఎస్‌.కె.ఫిరోజ్‌, జంగాల సదాశివుడు, నాళ్ల వేణుమాధవ్‌, ఎస్‌.కె.ఫైజ్‌ తదితరులు పాల్గొన్నారు.