CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అంగన్‌వాడీల్లో అంగన్‌ మిలన్‌

  • చిన్నారులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ.. అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

హుస్నాబాద్‌ రూరల్‌, అక్టోబరు 6 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘పీఎం సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా పందిళ్ల, దేవేంద్రనగర్‌, పోట్లపల్లి, మడద అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం ‘అంగన్‌ మిలన్‌’ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బుక్యా సంపత్‌నాయక్‌ అధ్యక్షతన, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లకావత్‌ శారద నేతృత్వంలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మహిళా సంఘాల సీఏలను చీరలు, శాలువాలతో సన్మానించారు. చిన్నారుల ఆరోగ్యం, మహిళల సంక్షేమం కోసం అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, తోట స్వరూప, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెల్దండి రాజేంద్రప్రసాద్‌, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.