13-ఎల్ కాలువ రీడిజైన్ చేయాలి
పేద రైతులు, ఇళ్ల స్థలాలకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడాలి హుస్నాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ శివారులో 13-ఎల్ కాలువ నిర్మాణానికి భూముల సర్వే చేసేందుకు మంగళవారం ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ రావడంతో బాధిత రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాలువ పరిధిలో చిన్నచిన్న కమతాలు కలిగిన నిరుపేద రైతులు భూములతో పాటు ఇళ్ల స్థలాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలువ తవ్వినా నీరు సక్రమంగా రాక పూడుకుపోయిన విషయాన్ని అధికారులు...