యువత రాజకీయాల్లోకి రావాలి: సాదుల పవన్ కుమార్

నంగునూరు(చైతన్యగళం): యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సిద్దిపేట జిల్లా యూవజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. జిల్లాలో యువజన కాంగ్రెస్ నిర్మాణాన్ని పూర్తి చేసి, మండలాల వారీగా...