CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువత రాజకీయాల్లోకి రావాలి: సాదుల పవన్ కుమార్

నంగునూరు(చైతన్యగళం): యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సిద్దిపేట జిల్లా యూవజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. జిల్లాలో యువజన కాంగ్రెస్ నిర్మాణాన్ని పూర్తి చేసి, మండలాల వారీగా బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సాదుల పవన్ కుమార్ సూచించారు.యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ వాహబ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యంగా యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ రాశిద్,ఆత్మా కమిటీ జిల్లా డైరెక్టర్ అజ్మత్, జిల్లా మైనారిటీ నాయకులు ఆతిఫ్, యువజన నాయకులు మంగళారపు వెంకటేష్, సిర్రం బాను, సాయికుమార్,మహేష్ ,అఖిల్,నవీన్, రాజు, విగ్నేష్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.