‘కాకా’ వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

హుస్నాబాద్‌లో ఘనంగా 97వ జయంతి వేడుకలు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మాజీ కేంద్రమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ‘కాకా’ వెంకటస్వామి సేవలను కాంగ్రెస్‌ నాయకులు స్మరించుకున్నారు. ఆయన 97వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి...