సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలి

ప్రతి శక్తికేంద్రం నుంచి ఐదు బైకులతో తరలిరావాలి: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి హుస్నాబాద్‌, అక్టోబరు 5 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు కృతజ్ఞతగా, వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యంతో ఈ నెల 7న నిర్వహించనున్న సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్‌ అసెంబ్లీ కేంద్రం నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి...