కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం
కొత్త ప్రణాళికతో రూ.400 కోట్లు ఆదా అవసరమైన చోటే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 5(చైతన్యగళం): కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనుల ప్రణాళికలో జీహెచ్‌ఎంసీ కీలక మార్పులు చేసింది. పార్క్ చుట్టూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకమార్గ (వన్‌వే) విధానం, ఉచిత ఎడమ మలుపు (ఫ్రీ లెఫ్ట్)తో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. ఏకమార్గ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. తాజా మార్పులతో ప్రాజెక్టు వ్యయంలో సుమారు రూ.400 కోట్లు ఆదా...