విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం

సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యకరమైన జీవనం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్‌ మాలోతు మణి, డీసీసీ కార్యదర్శి భాస్కర్‌ నాయక్‌ అక్కన్నపేట, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, చురుకుదనం, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమం అభినందనీయమని గ్రామ సర్పంచ్‌ మాలోతు మణి, డీసీసీ కార్యదర్శి భాస్కర్‌ నాయక్‌ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం కపూర్‌ నాయక్‌ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బొల్లం శ్వేత ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...