CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:22 am Posted by : CHAITHANYA GALAM NEWS

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గుగులోతు విజయదేవి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 4 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గుగులోతు విజయదేవి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. రామచంద్రరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నేనావత్‌ రవినాయక్‌ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

తనకు ఈ బాధ్యత అప్పగించేందుకు సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు విజయదేవి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.

తన నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజయదేవి ధన్యవాదాలు తెలిపారు.