పంతులు తండా పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

అక్కన్నపేట, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అక్కన్నపేట మండలం పంతులు తండా ఎంపీపీఎస్‌ పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్‌ చిన్నా నాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాఠశాలలకు హాజరు శాతం పెంచి, చదువుపై ఏకాగ్రతను పెంపొందించడమే...