CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:11 pm Posted by : rakeshkashaveni12@gmail.com

అఖిల్ కుటుంబానికి యువత ఆపన్నహస్తం – రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం

హుస్నాబాద్, అక్టోబర్ 04 (చైతన్యగలం):

హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల అఖిల్ కుటుంబానికి అంబేద్కర్ నగర్ యువత, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో అఖిల్ మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న అఖిల్ మృతి చెందడంతో చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ నగర్ యువత, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు “హార్ట్స్ టుగెదర్ ఫర్ ఫ్యామిలీ కేర్ అండ్ సపోర్ట్” పేరుతో విరాళాలు సేకరించి రూ.1,20,000 ఆర్థిక సహాయాన్ని అఖిల్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల్ మన మధ్య లేకపోయినా ఆయన కుటుంబం ఒంటరిగా లేదనే భరోసా కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు సాధ్యమైనంత అండగా నిలుస్తామని, ఆపదలో ఉన్న కుటుంబానికి మనమంతా ఒక కుటుంబంలా అండగా నిలవాలని అన్నారు. ఆపద సమయంలో అఖిల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అంబేద్కర్ నగర్ యువత, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులను గ్రామస్తులు అభినందించారు. మానవత్వానికి ఈ సేవా కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు.