అనంతగిరి ట్రైల్‌ రన్‌లో హుస్నాబాద్‌ రన్నర్ల ప్రతిభ

32 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసిన ముగ్గురు.. 16 కిలోమీటర్ల విభాగంలో మరో ముగ్గురి ప్రతిభ హుస్నాబాద్‌, అక్టోబర్‌ 4 (చైతన్యగళం): తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్‌ అనంతగిరి కొండల్లో ఆదివారం నిర్వహించిన ‘అవంతిక అనంతగిరి హిల్స్‌ ట్రైల్‌ రన్‌–2026’లో హుస్నాబాద్‌కు చెందిన రన్నర్లు ప్రతిభ కనబరిచారు. కొండమీది హరి ప్రసాద్‌, బోయినీ పృథ్వీరాజ్‌, బత్తుల శ్రీను 32 కిలోమీటర్ల విభాగాన్ని పూర్తి చేశారు. ఇరుగు ఆశి, వొద్దిరాల శంకర్‌, ముద్దసాని యుగేందర్‌రెడ్డి 16 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు. దట్టమైన అడవులు, ఎత్తైన...