కుమ్మర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
హుస్నాబాద్ మండల అధ్యక్షుడిగా నమిలికొండ ఐలయ్య ఏకగ్రీవం హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 4 (చైతన్యగళం): హుస్నాబాద్ మండల కుమ్మర సంఘం నూతన అధ్యక్షుడిగా నమిలికొండ ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హుస్నాబాద్‌లో సిద్దిపేట జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు తరిగొప్పుల రామచంద్రం అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సముద్రాల సతీష్, కోశాధికారిగా ఇజ్జగిరి అనిల్, ఉపాధ్యక్షుడిగా ఇటీకాల మొండయ్య, గౌరవ అధ్యక్షుడిగా కనుగుల మోహన్, ఉద్యోగ విభాగం అధ్యక్షుడిగా నాంపల్లి...