- హుస్నాబాద్ మండల అధ్యక్షుడిగా నమిలికొండ ఐలయ్య ఏకగ్రీవం
హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 4 (చైతన్యగళం): హుస్నాబాద్ మండల కుమ్మర సంఘం నూతన అధ్యక్షుడిగా నమిలికొండ ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హుస్నాబాద్‌లో సిద్దిపేట జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు తరిగొప్పుల రామచంద్రం అధ్యక్షతన సమావేశం జరిగింది.
ప్రధాన కార్యదర్శిగా సముద్రాల సతీష్, కోశాధికారిగా ఇజ్జగిరి అనిల్, ఉపాధ్యక్షుడిగా ఇటీకాల మొండయ్య, గౌరవ అధ్యక్షుడిగా కనుగుల మోహన్, ఉద్యోగ విభాగం అధ్యక్షుడిగా నాంపల్లి సిద్ది రాములు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీ, కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. కుమ్మర వృత్తి పరిరక్షణ, కులస్తుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగపురి రమేష్, ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంతోష్, యాదగిరి సంపత్, గణేష్, సంపత్, రాములు, శేఖర్ భూమయ్య, సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.