ఐఐటీయన్ల మేధస్సుతో ఏపీని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

అమరావతిని ప్రపంచ స్థాయి లోతైన సాంకేతికత కేంద్రంగా అభివృద్ధి చేస్తాం విజయవాడ, అక్టోబర్‌ 3(చైతన్యగళం): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఐఐటీయన్ల మేధస్సును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధికి ఐఐటీయన్లు అనుసంధానమై పనిచేయాలని సూచించారు. అమరావతిని ప్రపంచస్థాయి జ్ఞాన, డీప్‌టెక్‌ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో శనివారం జరిగిన పాన్‌ ఐఐటీ ఏపీ సదస్సు–2026లో సీఎం పాల్గొన్నారు. అమరావతి కేంద్రంగా పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌...