గాంధీజీకి ఘన నివాళి అర్పించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్‌

నల్లగొండ, అక్టోబరు 2 (చైతన్యగళం‌): మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్‌ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. సత్యాగ్రహం, సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా వంటి ఉద్యమాల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారని అన్నారు. అంటరానితనం నిర్మూలన, గ్రామస్వరాజ్యం, స్వదేశీ, స్వచ్ఛత, సర్వోదయం వంటి భావాలను...