CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:16 am Posted by : CHAITHANYA GALAM NEWS

గాంధీజీకి ఘన నివాళి అర్పించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్‌

నల్లగొండ, అక్టోబరు 2 (చైతన్యగళం‌):

మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్‌ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు.

సత్యాగ్రహం, సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా వంటి ఉద్యమాల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారని అన్నారు. అంటరానితనం నిర్మూలన, గ్రామస్వరాజ్యం, స్వదేశీ, స్వచ్ఛత, సర్వోదయం వంటి భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు. గాంధీజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా విస్తృతంగా నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్‌, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాదగోని మహేష్‌కుమార్‌గౌడ్‌, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.