బతుకమ్మ నిమజ్జనానికి మెట్లు ఏర్పాటు చేయాలి
మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పనులు పూర్తికాలేదు బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమ విభాగం నాయకుడు మాంకాల రమేష్ కోహెడ, అక్టోబర్ 3 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు వద్ద బతుకమ్మ, గౌరమ్మ నిమజ్జనానికి మహిళలు సురక్షితంగా వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమ విభాగం నాయకుడు మాంకాల రమేష్ కోరారు. శనివారం ఆయన వాగు వద్ద బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు...