జైలు జీవితం మార్పునకు వేదిక కావాలి

కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం): జైలు జీవితం మార్పునకు వేదిక కావాలని, గతం గురించి ఆలోచించకుండా ఇక్కడున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంచుకుంటూ, చదువు నేర్చుకొని బయటకు వెళ్లిన తర్వాత మంచి పౌరులుగా ఉన్నత స్థాయిలో ఉండేలా బాటలు వేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఖైదీలకు సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శివకుమార్, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్...