గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులపై మంత్రుల సమీక్ష హుస్నాబాద్, అక్టోబర్ 3 (చైతన్యగళం): గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, సవరించిన అంచనాలు, కాలువల పనులు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి...