రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

100 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ కోహెడ, అక్టోబర్ 3 (చైతన్యగళం): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నిర్మల జయరాజ్‌, వైస్‌ చైర్మన్‌ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సతీష్‌ అన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కోహెడ మండల రైతు వేదికలో శనివారం వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌,...