రాజ్యాంగ పరిరక్షణకు చైతన్య సదస్సు
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో చైతన్య వేదిక కమిటీల ఏర్పాటు హుస్నాబాద్, అక్టోబర్ 3 (చైతన్యగళం): రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య సదస్సు నిర్వహించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ నిర్ణయించింది. శనివారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలతో పాటు ఎస్‌ఐఆర్ అంశంపై చర్చించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఇందులో భాగంగా హుస్నాబాద్...