- నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో చైతన్య వేదిక కమిటీల ఏర్పాటు
హుస్నాబాద్, అక్టోబర్ 3 (చైతన్యగళం): రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య సదస్సు నిర్వహించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ నిర్ణయించింది. శనివారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలతో పాటు ఎస్‌ఐఆర్ అంశంపై చర్చించారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఇందులో భాగంగా హుస్నాబాద్ మండల కమిటీని ఎన్నుకున్నారు.
సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, సావుల మంజుల, బత్తుల స్వరూప, జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, ఇల్లందుల లక్ష్మణ్‌గౌడ్, నాంపల్లి సమ్మయ్య, మెతుకు కొమరయ్య, చెప్యాల ప్రకాష్, మార్క అనిల్, వేముల జగదీష్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిత్తారి రవీందర్ పాల్గొన్నారు.
బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, హుస్నాబాద్ పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ, వెన్నరాజు, ఓయూజేసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు జనగామ రాజ్‌కుమార్, సీపీఐ నాయకులు కొయ్యడ కొమురయ్య, గూడ పద్మ, జంగ విజయ, బీఆర్‌ఎస్ నాయకులు వంగ వెంకట్రామిరెడ్డి, బండి పుష్ప, జన జాగృతి కళా సమితి అధ్యక్షుడు ముక్కెర సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల చంద్రమౌళితో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.