పంచాయతీ అవసరాలపై ప్రణాళిక సిద్ధం చేయాలి
గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల గుర్తింపు మిర్యాలగూడ, అక్టోబరు 2 (చైతన్యగళం): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొట్యానాయక్ తండా, గూడూరు గ్రామపంచాయతీల్లో గురువారం ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభలు నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2027–28లో భాగంగా గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు. వి.బి.జి. రామ్‌జీ పథకం కింద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి గ్రామానికి ఊటకుంట, రైతులకు ఫామ్‌పాండ్, బోర్‌వెల్‌ల రీచార్జి గుంతలు, ఇళ్లపై వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, సామూహిక ఇంకుడు గుంతలు...