హామీలను గాలికొదిలి.. కక్ష సాధింపేనా?

రేవంత్‌ సర్కారుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శలు కరీంనగర్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల హామీల...