గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్‌

గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే మురళీనాయక్‌ నివాళులు మహబూబాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం పార్క్‌ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛత హీ సేవా–2026’లో భాగంగా అన్ని వార్డుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లకు సూచించారు. 1931లో రైలులో ప్రయాణిస్తూ మహాత్మా గాంధీ మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన...