CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 10:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్‌

  • గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే మురళీనాయక్‌ నివాళులు

మహబూబాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం పార్క్‌ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛత హీ సేవా–2026’లో భాగంగా అన్ని వార్డుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లకు సూచించారు.

1931లో రైలులో ప్రయాణిస్తూ మహాత్మా గాంధీ మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ జ్ఞాపకార్థమే గాంధీ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భావితరాలకు గాంధీజీ స్ఫూర్తిని అందించేలా త్వరలో పార్క్‌లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి, కమిషనర్‌ వినోద్‌కుమార్‌, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.