పెండింగ్ ఎస్‌ఐఆర్ నోటీసులను వారం రోజుల్లో పరిష్కరించాలి
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌లో హియరింగ్ కాకుండా ఉన్న 25 వేల నోటీసులకు సంబంధించి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సరైన ధ్రువపత్రాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూపర్‌వైజర్లను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల ఎమ్మార్వోలు, బీఎల్వో సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో దశ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీ, హియరింగ్, ఆన్‌లైన్ నమోదు తదితర అంశాలపై సమీక్షించారు....