బి. హరి వెంకట ప్రసాద్‌కు ‘కిసాన్ సేవా రత్న’ అవార్డు

రైతుల సేవలకు గుర్తింపుగా పురస్కారం హైదరాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): రైతుల సేవలకు గుర్తింపుగా బి. హరి వెంకట ప్రసాద్‌కు ‘కిసాన్ సేవా రత్న’ అవార్డు లభించింది. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలు,...