సిరిసిల్ల సభపై బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

సభ విజయాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారన్న కొరివి అరుణ్‌కుమార్‌ కరీంనగర్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిర్వహించిన సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అలువాల కోటితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, జనం రాలేదంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలను...