రైతు వేదికలో కోతుల హల్‌చల్
500 పల్లికాయల బ్యాగులు చింపివేత.. అధికారులకు తప్పని ఇబ్బందులు కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): కోహెడ రైతు వేదికలో కోతుల బెడదతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు పంపిణీ చేసేందుకు మండలానికి వచ్చిన సుమారు 500 పల్లికాయల బ్యాగులను కోతులు చింపివేయడంతో పల్లికాయలు చిందరవందరగా పడ్డాయి. రైతు వేదికలో నిల్వ ఉంచిన బ్యాగులపై కోతులు దాడి చేసి చించడంతో నష్టం వాటిల్లింది. కోతులను తరిమేందుకు ఏఈఓ కట్టె పట్టుకుని ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు వేదిక పరిసరాల్లో తరచూ కోతులు సంచరిస్తుండటంతో అధికారులు,...